ప్రజా సమస్యలు పరిష్కరించడమే గడపగడపకు ప్రభుత్వం లక్ష్యం
1 min read
11/10/2022
గడప గడప కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ
అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్న.. ఎమ్మెల్యే, పి ,రవీంద్ర నాథ్ రెడ్డి, పల్లెవెలుగు వెబ్, చెన్నూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నుండి మండలంలోని గుర్రంపాడు పంచాయతీలోని ఓబులంపల్లె లో కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, కి, ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు, కొంతమంది ప్రజలు, పక్కా గృహాల సమస్య అలాగే తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా వారు ఆయన దృష్టికి తీసుకు రావడం జరిగింది, ఆయన స్పందించి వెంటనే పక్కా గృహాలు మంజూరు చేయాలని , హౌసింగ్ అధికారులకు సూచించారు, అలాగే అక్కడి ప్రాథమిక పాఠశాల ను పరిశీలించి అక్కడి బాత్రూమ్లను, అలాగే త్రాగునీటి కులాయి లను పరిశీలించారు ,విద్యార్థుల ను పలకరించి వారి తో మాట్లాడడం జరిగింది, విద్యార్థులకు పుస్తకాలు, అదేవిధంగా షూ, స్కూలు బ్యాగు, బట్టలు అందాయా లేదా , మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు, మెను ప్రకారం భోజనం పెడుతున్నారని, పాఠ్యపుస్తకాలు, అని కూడా ఇచ్చారని విద్యార్థులు ఎమ్మెల్యేకి తెలపడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే గడప గడప యొక్క ముఖ్య ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగ తెలియజేశారు, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అక్కడికక్కడే ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముండ్ల సుధాకర్ రెడ్డి , సర్పంచ్ చల్లా ప్రమీల, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, ముండ్ల పల్లె సర్పంచ్ పాండు రంగారెడ్డి , మాజీ సొసైటీ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు చంద్రబాబు రెడ్డి, జంబ పురం బాబు రెడ్డి వై ఎస్ ఆర్ సి పి, యువ నాయకులు చల్లా అన్వేష్ రెడ్డి, ఎంపీటీసీ పెనుబాల సుబ్బ లక్ష్మమ్మ, మాజీ నీటి సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, చల్లా వెంకటసుబ్బారెడ్డి, లేవా కు వేణుగోపాల్ రెడ్డి, ముది రెడ్డి లక్ష్మి రెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్ వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా సీమ బాబు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి ఎన్ ,భాస్కర్ రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి కమలాపురం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, ,సొసైటీ అధ్యక్షుడు ముది రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,ఎంపీటీసీ లు ముది రెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, రఘురాం రెడ్డి, సాధిక్ అలీ, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్,,వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.