సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
1 min read– జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె .నాగరాజు
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు: గ్రామంలోని ఇండ్ల వద్ద ఉన్న చెత్తా,చెదారాన్ని , అలాగే నీటి గుంతలను, ఆయా పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే నాగరాజు సూచించారు, మంగళవారం ఆయన, మండలంలోని రామనపల్లె, సచివాలయ పరిది రామన పల్లె హరిజన వాడ లో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి ప్రజలు తెలపడంతో, అక్కడ మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె నాగరాజు మాట్లాడుతూ ముఖ్యంగా రాత్రిపూట దోమలు ప్రబలకుండా ఖచ్చితంగా దోమ తెర లను వినియోగించుకోవాలని అక్కడి ప్రజలకు ఆయన తెలియజేశారు, అదేవిధంగా రాత్రిపూట ఇంటి కిటికీలకు మెసులు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు, ఈ సందర్భంగా ఆయన ఏఎన్ఎం లను ఆశ వర్కర్ల ను గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే, స్ప్రేయింగ్ లార్వా సర్వే, న, రక్త నమూనాలు సేకరించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని అక్కడి వైద్య సిబ్బందికి సూచించారు, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన పద్ధతులను గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉండగా ఆయన వైద్య సిబ్బందికి తెలియజేశారు, అంతేకాకుండా ప్రజలకు అవసరమైన మందులు అన్నిటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు, అనంతరం ఆయన ప్రజలతో సమావేశమై ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ,వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచు కుంటూ మురికి కాలవలో వ్యర్థాలు పడకుండా పరి శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే వారు ప్రైవేటు ఆసుపత్రుల కు వెళ్లకుండా , ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని తెలిపారు ప్రతి ఫ్రైడే, డ్రై డే గా పక్కాగా పాటించాలని వైద్య సిబ్బందికి తెలియజేశారు, అంతేకాకుండా వైద్యపరంగా ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ, వారికి తగినటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది ఇవ్వాలని ఆయన వైద్య సిబ్బందికి సూచించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి తో పాటు, డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, ఎంపీ హెచ్ ఈ వో, ఎం వి వి ప్రసాద్, ఎం పి హెచ్ ఎస్ కే ఎస్ వి ప్రసాద్, సూపర్వైజర్ బి సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.