నిర్లక్ష్యం వహించవద్దు..ఎంపీడీవో విజయసింహారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: మంగళవారం నాడు ఎంపీడీవో విజయసింహారెడ్డి గని గ్రామ సచివాలయం ను సందర్శించి సిబ్బంది, వాలంటీర్స్ మరియు గ్రీన్ అంబాసిడర్ ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సలహాలు సూచనలు ఇచ్చారు. సిబ్బంది బయో మెట్రిక్ అటెండెన్స్ చెక్ చేశారు. సచివాలయం నందు అందరు తప్పకుండా మ.3 నుండి సా.5 వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించాలని. సిబ్బంది అందరు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని, విధుల సమయపాలన పాటించాలని వాలంటీర్స్ కూడ తప్పకుండ బయో మెట్రిక్ అటెండెన్స్ వెయ్యాలన్నారు .అలాగె గ్రీన్ అంబాసిడర్ సిబ్బంది కి పలు అంశాలపై అవగాహన కల్పించి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కేటాయించిన ఇళ్ళ నుండి చెత్త సేకరించాలని ఆదేశించారు. గ్రామాలలో పరిశుభ్రత పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు నిర్లక్ష్యంగా వహించిన వారిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయన్నారు అనంతరం గ్రామ సచివాలయం లో నిర్మిస్తున్న RBK సెంటర్ హెల్త్ సెంటర్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శివానంద రెడ్డి, ఈఓఆర్డి అబ్దుల్ ఖాలిక్ గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .