పని తీరు భేష్..
1 min read– జిల్లా నోడల్ అధికారులను అభినందించిన కలెక్టర్
– కోవిడ్ కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం
– కలెక్టర్ జి. వీరపాండియన్
పల్లెవెలుగువెబ్, కర్నూలు : కోవిడ్ నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా నోడల్ కమిటీ అధికారుల పని తీరు బాగా ఉందని కలెక్టర్ జి. వీరపాండియన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా నోడల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితర మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత సామర్థ్యం పెంచాలన్నారు. రాష్టంలోనే కర్నూలు జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్స్ లో హైఎస్ట్ నంబర్ ఆఫ్ కోవిడ్ పేషేంట్స్ ఉన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, సున్నిపెంట తదితర కోవిడ్ కేర్ సెంటర్స్ లో 6 వేల రూమ్స్/బెడ్స్ అందుబాటులో ఉండగా ఇప్పటికే 5,900 ల మంది కోవిడ్ బాధితులు అడ్మిట్ కాగా, వారిలో 2500ల మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 8000 ల బెడ్స్/రూమ్స్ కెపాసిటీకి కోవిడ్ కేర్ సెంటర్స్ లో పెంచాలని ఆదేశించారు.
నంద్యాల కేర్ సెంటర్‌పై ఫిర్యాదు.. : అయితే ..నంద్యాల కోవిడ్ కేర్ సెంటర్ లో కోవిడ్ బాధితులకు భోజనం సరిగా పెట్టడం లేదనే వీడియో వైరల్ అయింది..అందువల్ల చిన్న చిన్న తప్పులను వెంటనే సరిదిద్దుకుని అన్ని కోవిడ్ కేర్ సెంటర్స్ లో భోజనాలు, త్రాగు నీరు, శానిటేషన్ తదితర సదుపాయాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా భోజనాల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి..టోకెన్స్ ఇచ్చి గుంపులుగా కాకుండా..ఒక్కొక్కరే వచ్చి ఫుడ్ ప్యాకేట్స్ ను తీసుకెళ్లి వారి రూమ్స్ లో తినేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జి. వీరపాండియన్ ఆదేశించారు.
రెమిడిసివర్ కొరత లేదు..: ప్రభుత్వ, ప్రవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఆక్సీజన్, రేమిడిసివర్ కొరత లేదు.. నోడల్ టీమ్స్ బాగా చేశారు..రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఆక్సీజన్, రేమిడిసివర్ కొరత రానివ్వకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టండి.. గురువారం 42 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ వినియోగం జరిగింది.. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సీజన్ ను ప్రోటోకాల్ ప్రకారం జాగ్రత్తగా వాడుతున్నారా..లేదా వెస్టేజీ ఏమైనా ఉందా అని మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ తో నియమించిన ఆక్సీజన్ ఆడిట్ కమిటీ తో తనిఖీలు చేయించాలి. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జేసీ(రెవెన్యూ) ఎస్.రామసుందర్ రెడ్డి, జేసీ(సంక్షేమం) శ్రీనివాసులు, కె.ఎం.సి.కమీషనర్ డికె బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి.ఆర్.ఓ పుల్లయ్య, డి.ఎం.హెచ్.ఓ రామగిడ్డయ్య, ఆర్.డి.ఓ.లు, జిల్లా నోడల్ కమిటీల అధికారులు, కోవిడ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.