ఆదోనిలో… ఘనంగా ‘మిలాద్ ఉన్ నబి’ వేడుకలు
1 min readమహ్మద్ ప్రవక్త బోధనలు.. ఆచరణీయం వక్తలు
పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ కేంద్రంలో మిలాద్ ఉన్ నబి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని పెద్ద మసీదు, ఖాజీపుర తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు. మత పెద్దలు ప్రవక్త బోధనలు తెలియజేశారన్నారు. తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలన్నారు. మహ్మద్ ప్రవక్త అత్యంత సాదా సీదా జీవనాన్ని గడిపి సాటి వారికి ప్రేమాభిమానాలు పంచి సమాజంలో శాంతి స్థాపనకోసం కృషి చేశారన్నారు. యావత్తు జీవ జాతులలో మానవాళి అత్యున్నతమైనదని మానవసేవయే మాధవసేవన్నారు. అందరితో సోదరభావంగా ఉండాలన్నారు. మహాప్రవక్త మహమ్మద్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనమందరం మహాప్రవక్త గారి సూత్రాలను పాటిస్తూ, ఆయన బాటలో నడుస్తూ శాంతియుత జీవనాన్ని కొనసాగిద్దామని ఈ సందర్భంగా మతపెద్దలు బోధించారు.