కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
1 min readపల్లెవెలుగువెబ్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు ఒన్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2022-23 నుంచి 2025-26 వరకూ పదిహేనో ఆర్ధిక కమిషన్ ప్రకారం ఈ కొత్త పథకం అమలౌతుంది.