బాణసంచా అమ్మకాలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు, వెబ్ ఏలూరు : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో గల ఒక ప్రైవేట్ రైస్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాణాసంచా అమ్మకాలను బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ వేండ్ర వెంకటస్వామి, దెందులూరు ఎంఎల్ఎ కొఠారు అబ్బయ్యచౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిసిఎంఎస్ ఛైర్మన్ వేండ్ర వెంకటస్వామి మాట్లాడుతూ దాదాపు 500 రకాలు స్టాండెడ్ కంపెనీకి చెందిన బాణాసంచాలను హోల్సేల్ రేట్లకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన బాణాసంచాలను అమ్మకాలు జరుపుతామన్నారు. కావాల్సిన వారు త్వరతిగతినే జాప్యం చేయకుండా అన్నిరకాలు ఉండగానే కొనుగోలు చేసుకుని దీపావళిని దేదీప్యమానంగా నిర్వహించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, వెంకటేశ్వరరావు, బిజినెస్ మేనేజరు కృష్ణమోహన్, రైస్ మిల్ అసోషియేషన్ ప్రెసిడెంట్ ఆళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.