సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలి : ఎంపీడీఓ
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు:స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ పథకాలపై ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి అధ్యక్షతన రివ్యూ సమావేశం జరిగినది.ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఇప్పటిదాకా మండలంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం తలముడిపి,వీపనగండ్ల,దేవనూరు,కడుమూరు గ్రామాలలో జరిగిందని ఈకార్యక్రమంలో గ్రామాల్లో వచ్చిన సమస్యలు రోడ్లు,త్రాగు నీటి పైపుల పనులు చేయుటకు నిధులు మంజూరు అయ్యాయని త్వరగా వెంటనే గ్రామాలలో పనులు ప్రారంభించాలన్నారు.జగనన్న కాలనీలో నిర్మిస్తున్న గృహాలు మండలంలో వెనుకబడ్డాయని గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహాలు స్టేజ్ కన్వర్షన్ పెంచడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.అన్ని గ్రామాలలో ఇంటి పన్ను కొళాయి పన్నులు త్వరితగతిన పూర్తి చేయాలి.అంతేకాకుండా సచివాల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ డ్రెస్ కోడ్ ధరించాలన్నారు.వివిధ గ్రామాల్లో మిగిలిన వాలంటరీ పోస్టులకు ఈనెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుందని అన్నారు.సచివాలయాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి చర్చించారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు పురోగతి కనపడాలని,ప్రయారిటీ బిల్డింగ్స్ లో వేగం పెంచాలని అన్నారు.ప్రతి సచివాలయంలో సర్వీసులను పెంచాలని,వాటికి వచ్చిన అమౌంట్ ను వెంటనే చెల్లించాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఈవోఆర్డి ఫక్రుద్దీన్,ఏపీఓ జయంతి,ఏపిఎం సుబ్బయ్య,హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.