PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల సంరక్షణకు సమష్టి కృషి…

1 min read

– బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు శ్రీమతి లక్ష్మిదేవి

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : బాలలను సంరక్షించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు శ్రీమతి లక్ష్మిదేవి తెలిపారు. బాలల హక్కుల రక్షణకు సంబందించిజిల్లాలో చేపడుతున్న చర్యలను పరిశీలించేందుకు బుధవారం కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మొదట మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సిడిపిఓలకు సూచించారు. బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటాము. న్నారు. అలాగే బాల్య వివాహాల నిరోధానికి కూడా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇందుకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తోడ్పాటునందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల సందర్శన కర్నూలు జిల్లా కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. నగరంలోని శరీన్ నగర్ లో కొనసాగుతున్న మూడు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, గర్భవతులకు శ్రీమంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం ద్వారా సరఫరా అవుతున్న పౌష్టికాహారాన్ని ప్రతి గర్భవతి : వినియోగించుకోవాలన్నారు. పౌష్టికాహారంతో తీసుకోవడం ద్వార సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని తద్వార ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు అనురాధ, వరక్ష్మిదేవమ్మ . నాగమణి, మద్దమ్మ, ఐసిపిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. బాలల, మహిళల రక్షణకు ప్రత్యేక చొరవ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు శ్రీమతి లక్ష్మిదేవితో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ జిల్లాలో బాలలు, మహిళల రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు లక్ష్మిదేవితో చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్పీని సంప్రదించి జిల్లాలో బాలలు, మహిళల రక్షణకు పోలీసు శాఖ తీసుకుంటున్నరక్షణ చర్యలపై ఆరా తీశారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.

About Author