పేదల సంక్షేమమే ధ్యేయం..
1 min read– పథకాల అమలులో.. దేశంలోనే ప్రథమం..
– రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్
– కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ కింద 1.77 కోట్ల చెక్కుల పంపిణీ
పల్లెవెలుగువెబ్, మహమూబ్నగర్: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురరువారం మహబూబ్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 177 మంది ( కళ్యాణలక్ష్మి, షాదిముబారక్) లబ్ధిదారులకు రూ. కోటి 77 లక్షల విలువైన చెక్కులను అర్హులైన పేదలకు అందజేశారు. కలెక్టర్ ఎస్. వెంకటరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో.. నియోజకవర్గ పరిధిలోని 57 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ. 24 లక్షల 27వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గతంలో పేద ఆడబిడ్డల పెళ్లికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు ఆసరాగా నిలిచి పెళ్లికి లక్షా 16వేలను కానుకగా అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందు లాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ kc నర్సింలు, కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.