PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కెనరా బ్యాంక్అధ్వర్యంలో.. నిత్యావసర వస్తువులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ అధ్వర్యం లో , ​​కాంగ్రెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో(CSR) భాగంగా విమల ప్రావిన్స్ హౌజ్ లెప్రసి సెంటర్ వారికి అవసరమైన సీలింగ్ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు డొనెట్ చేయడం జరిగింది.అలాగే డాన్ బోస్కో నవ జీవన్ వీధి బాలల హాస్టల్ కు కావలసిన ఫ్యాన్లు, టూబ్ లైట్లు, తాళాలు పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ కే వీరేంద్ర బాబు అసిస్టెంట్ జనరల్ మేనేజర్* మాట్లాడుతూ కెనరా బ్యాంక్ దేశంలో మూడవ అతి పెద్ద బ్యాంక్.కర్నూల్ జిల్లాలో కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్ వుంది.జిల్లాలో కెనరాబ్యాంక్ ప్రజలకు ఉపయుక్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము.అంటే కాకుండా ఇలాంటి దాతృత్వ పనులు చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది అని చెప్పారు.విద్యార్థులు థో మాట్లాడుతూ బాగా చదువుకోవాలని,పెద్ద పెద్ద జాబ్స్ లో వున్నవారంతా కూడా గవ్నమెంట్ స్కూల్ లో చదివిన వారేనని, పేరెంట్స్ లేరని నిరుత్సాహ పడకుండా బాగా చదవాలని సూచించారు.హాస్టల్ ఇంచార్జిలతో మాట్లాడిన రిజనల్ మనేజర్ ఇంకా ఏదైనా అవసరం వుంటే మ దృష్టికి తీసుకు రాగలిగితే మా స్థాయిలో వుంటే కర్తవ్యంగా సహాయం అందించారు,ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలను జిల్లాలో మరింతగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వై వెంకట నారాయణ,కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్, సీనియర్ మేనేజర్ నాగ శేషయ్య, మేనేజర్ రవి, మరియు బ్యాంక్ సిబ్బంది, ట్రస్ట్ సిబ్బంది పాల్గోనారు.

About Author