ఆలూరు నేతలతో సీఎం జగన్ భేటీ !
1 min readపల్లెవెలుగువెబ్: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నేతలత సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి గుమ్మనూరి జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి జయరాం కూడా హాజరు కాగా… ఆలూరు నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పిన జగన్… ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని ఆయన సూచించారు. గడచిన మూడేళ్లలో ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలకు వివిధ పథకాల ద్వారా రూ.1,050 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని ఆయన నియోజకవర్గ నేతలకు సూచించారు.