ముస్లింల అభ్యున్నతికి కృషి
1 min read– మంత్రి శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్ నగర్: హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక రంజాన్ పండుగ అని పేర్కొన్నారు..రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. గురువారం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరావు, సిబ్బంది ఉన్నారు.