కర్ణాటక వేరుశెనగ పొలాల్లో రాహుల్ గాంధీ
1 min read
పల్లెవెలుగువెబ్: భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో సాగుతున్న సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా గురువారం రాష్ట్రంలోని మలహళ్లిలోని వేరుశనగ పంట పొలాల్లోకి దిగారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో కలిసి పంట పొలాల్లోకి దిగిన రాహుల్… వేరుశనగ మొక్కలను పీకి వాటి ఫల సాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన వేరుశనగ రైతులతో ముచ్చటించారు. వేరుశనగ సాగులో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు.