తాగుబోతును పాము కరిచి.. అదే చచ్చింది !
1 min readపల్లెవెలుగువెబ్: రాచనాగు అడుగుదూరంలో ఉంటేనే భయంతో సగం చస్తాం. అదే కాటేస్తే ఇంకేమైనా ఉందా? 15-20 సెకన్లలో ప్రాణాలే పోతాయి! ఓ తాగుబోతు మాత్రం.. రాచనాగు తనను రెండుసార్లు కాటేసి అదే చచ్చిపోయిందంటూ ఆస్పత్రికి పరుగెత్తుకొచ్చాడు. పైగా తన వెంట ఓ పాలిథిన్ కవర్లో చచ్చిన రాచనాగును పెట్టి వెంట తీసుకొచ్చాడు. యూపీలోని కుశీనగర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. కవర్లో కింగ్‌కోబ్రా కళేబరంతో వచ్చి పాదమ్మీద రెండుచోట్ల తనకు రాచనాగు కరించిందంటూ ఆ వ్యక్తి చెప్పడం, తనకు ఏదైనా వ్యాక్సిన్ ఇవ్వమని అడగడంతో వైద్యులు నోరెళ్లబెట్టారు.