రాజీవ్ గాంధీ హంతకుల విడుదలకు అనుకూలమే !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులు నళిని శ్రీహరన్, ఆర్‌పీ రవిచంద్రన్‌ల ముందస్తు విడుదలకు తాము అనుకూలమని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి శిక్ష తగ్గించాలని 2018లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రెండు వేర్వేరు అఫిడవిట్‌లను గురువారం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ‘రాజీవ్‌గాంధీ హంతకుల క్షమాభిక్ష పిటిషన్లను 2018 సెప్టెంబరు 9న నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశం పరిగణనలోకి తీసుకుంది. ఆర్టికల్ 161 కల్పించిన అధికారాన్ని వినియోగించుకొని, వారి జీవిత ఖైదు శిక్షను తగ్గించాలంటూ గవర్నర్‌కు సిఫారసు చేయాలని నిర్ణయించింది.