రోగులకు..మెరుగైన వైద్య సేవలు అందించాలి
1 min read– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెలుగు, వెబ్ కర్నూలు : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే పారిశుద్ధ్యం, డైట్, సెక్యూరిటీ తదితర అన్ని ఏజెన్సీ లు రోగులకు ఇబ్బంది కలగకుండా సక్రమంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్ర వారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు..సమావేశంలో ఎమ్మెల్యే లు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.నరేంద్ర నాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి,కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారని, ప్రభుత్వం కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు.. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు..వైద్యాధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆస్పత్రి అభివృద్ధి కి కృషి చేద్దామన్నారు.. పారిశుద్ధ్యం, డైట్, సెక్యూరిటీ తదితర ఏజెన్సీ ల పని తీరుపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.. రోగులకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్యం, డైట్, సెక్యూరిటీ తదితర అన్ని ఏజెన్సీ లు సక్రమంగా పని చేయాలన్నారు.. నిబంధనలకు అనుగుణంగా పని చేయని ఏజెన్సీ లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ డా.నరేంద్ర నాథ్ రెడ్డిని ఆదేశించారు…సక్రమంగా పని చేయని ఏజెన్సీల పై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ఆస్పత్రి లో మౌలిక వసతులు, రోగులకు వైద్య చికిత్సలు, ఏజెన్సీ ల ద్వారా సేవలు అందుతున్న తీరు, పత్రికల్లో వ్యతిరేక కథనాలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు..వచ్చే సమావేశంలో ఇందుకు అనుగుణంగా అజెండా సమగ్రంగా రూపొందించాలని కలెక్టర్ సూపరింటెండెంట్ డా.నరేంద్ర నాథ్ రెడ్డిని ఆదేశించారు..
డాక్టర్లు జనరిక్ మెడిసిన్స్ రాయాలి
సమావేశంలో ప్రధానంగా రోగులకు జనరిక్ మెడిసిన్స్ అందించడం పై కలెక్టర్, ఎమ్మెల్యేలు చర్చించారు.. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ మాట్లాడుతూ ఆస్పత్రి లోపల ఉన్న జీవన్ ధార జనరిక్ ఔట్ లెట్స్ లో జనరిక్ మెడిసిన్స్ పెడుతున్నారా లేక బ్రాండెడ్ మెడిసిన్స్ పెడుతున్నారా అని ప్రశ్నించారు.. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు..గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మందులు బయట రాయడం వల్ల వేల రూపాయలు ఖర్చు అవుతోందని పేద ప్రజలు చెప్తున్నారని తెలిపారు . డబ్బు లేక ఆస్పత్రి కి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు జనరిక్ మెడిసిన్స్ అందించాల్సిన అవసరం ఉందని సూచించారు..ఆస్పత్రిలో పారిశుధ్యం సరిగా లేదని రోగులు తన దృష్టికి తెచ్చారని, ఏజెన్సీ లు సక్రమంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు..సమావేశంలో ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO డా.వెంకటేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ మరియు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్, డా.శివబాల నగంజన్, డిఎంహెచ్ఓ డా.రామగిడ్డయ్య, APMSIDE DE రాజగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.