జీవితం ..సుఖదుఃఖాల సమరాంగణం
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ప్రతి ఒక్కరి జీవితం సుఖదుఃఖాల సమరాంగణమని, ఈ సమరం నుండి సులభంగా బయట పడాలంటే మహనీయులు నడిచినటువంటి మార్గాన్ని ఎంచుకోవాలని ప్రముఖ ధార్మిక ప్రవచకులు ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు అన్నారు. గత నాలుగు రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గోస్పాడు మండలం యం. కృష్ణాపురం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు మూడు రోజులపాటు శ్రీమద్రామాయణము, మహాభారతం, భగవద్గీతలపై రాగభరితంగా వారు చేసిన ధార్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ ఏరువ కోటేశ్వర రెడ్డి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వడ్ల సుబ్రహ్మణ్యం ఆచారి , శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వై . సోమేశ్వర రెడ్డి, అర్చకులు కరణం లక్ష్మీ పుల్లయ్య శర్మ, వై.ఈశ్వర్ రెడ్డి, డి. రంగస్వామి రెడ్డి, వేంకట నారాయణ రెడ్డి, భజన గురువు వై.పి బాలనాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, హార్మోనిస్టు లక్ష్మీనారాయణ, వడ్ల పెద్దాచారితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.