అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత ముఖ్యం
1 min readపల్లవెలుగు, వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినం సందర్భంగా ఈరోజు AMC వార్డులోని వైద్య సిబ్బందితో అవగాహన కార్యక్రమం (అవేర్నెస్ ప్రోగ్రాం) నిర్వహించినట్లు తెలిపారు.చేతులు కడుక్కోవడం కనీసం 20-30 సెకన్లు చేయాలి. ప్రతి ఒక్కరూ చేతులని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి రోగిని తాకడానికి ముందు, రోగిని తాకిన తర్వాత, ప్రక్రియ చేసే ముందు, ఏదైనా ద్రవం బహిర్గతం అయిన తర్వాత, రోగి పరిసరాలను తాకిన తర్వాత చేతులు కడుక్కోవాలి.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి Dy Csrmo, డా.హేమమాలిని, నోడల్ ఆఫీసర్ మరియు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివబాల నగంజన్, డా.కిరణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రి బాయ్, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లుగా ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.