బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషల్ డ్రైవ్..
1 min read– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: మహిళలు తమ కుటుంబాన్ని చూసుకుంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు మరియు ప్రతి సంవత్సరం అనేకమంది క్యాన్సర్ తో జీవిత యుద్ధంలో ఓడిపోతున్నారు. అతిపెద్ద సవాలు ఏమిటంటే, చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తారు మరియు వారు చికిత్స చేయలేని లేదా చికిత్స చేయడం కష్టంగా మారే దశకు చేరుకుంటారు. భారతదేశంలో, రొమ్ము క్యాన్సర్ అనేది అత్యంత సాధారణ క్యాన్సర్ మరియు మహిళల్లో వచ్చేవాటిలో 1/4వ వంతుఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు.జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు ఈరోజు నుండి ప్రారంభించినట్లు తెలిపారు.బెస్ట్ క్యాన్సర్ స్పెషల్ డ్రైవ్ జనరల్ సర్జరీ ఓపి14 విభాగంలో ఈరోజు నుండి 21/10/2022 వ తేదీ వరకు నిర్వహించినట్లు, తెలిపారు.ఆసుపత్రికి వచ్చి క్యాన్సర్ నివారణ స్పెషల్ డ్రైవ్ ద్వారా టెస్ట్ చేసుకొని ఏమైనా చిన్న సమస్యలు ఉన్న చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు.మహిళలలో ఎవరికైనా బెస్ట్ క్యాన్సర్ సింటమ్స్ ఉన్నట్లయితే ఆసుపత్రికి వచ్చి వారు చెకప్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి Dy.csrmo, డా.హేమనలిని, జనరల్ సర్జరీ HOD, డా.హరిచరణ్, డా.మాధవి శ్యామల, డాక్టర్స్ మరియు నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రి బాయ్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.