PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విహెచ్​పి జిల్లా శిక్షణా తరగతులు..

1 min read

పల్లెవెలుగు,వెబ్​ కర్నూలు: విశ్వహిందూపరిషత్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో రెండురోజుల15,16తేదీలలో శిక్షణా తరగతులు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్న విజ్ఞాన పీఠం (అరక్షిత శిశుమందిరం) లో ఘనంగా ప్రారంభించబడ్డాయి. జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ,రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్,రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్ గారలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ జిల్లాలో నాతో సహా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యకర్తలు శిక్షణ కోసం వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వహిందూ పరిషత్ యొక్క సమగ్రమైన సమాచారాన్ని అవగాహన కలిగించడం కోసం ఈ రెండురోజుల అభ్యాస వర్గ ఏర్పాటు చేయబడినది కావునా వచ్చిన ఇక్కడ హాజరైన కార్యకర్తలందరూ శ్రద్ధతో ఈ క్షుణ్ణంగా విని,రాసుకుని మన మన కార్యక్షేత్రాలలో పనిని పెంచాలని తెలియజేశారు. ప్రధాన వక్త రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్ మాట్లాడుతూ ట్రినిడాట్ దేశంలో అత్యధికంగా ఉండే హిందువులు తమ ధర్మం,సంప్రదాయం వంటి వాటిని తెలుసుకోవడం కోసం భారతదేశానికి వచ్చారు అని చూపుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం అవ్వడంతో వారికి సైతంరైన సమాధానం రాకపోవడంతో అప్పటి ప్రభుత్వం లో ఉండే కే.ఏ.మున్షీజీ అనే ఎం.పీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ను స్థాపించిన పరమపూజనీయ డాక్టర్ జీ(కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్) దగ్గరికి తీసుకెళ్ళారని అక్కడ అప్పటి ఆర్.యస్.యస్. రెండవ సరసంఘ చాలక్ మాన్య గురూజీ (గోళ్వోల్కర్) గారు ఆలోచించి విశ్వ వ్యాప్తంగా ఉన్న అశేష హిందూ సమాజం కొరకు హిందూ సంస్కృతీ,సంప్రదాయ లను,ధార్మిక విషయాలనూ బోధించడానికి ఒక విశ్వవ్యాప్తమైన ఒక సంస్థ ఉండాలని భావించి 1964 సం.లో ముంబయ్ లోని సాందీపనీ ఆశ్రమంలో పూజ్య చిన్మయానంద స్వామి,మైసూర్ మహారాజ ఛామరాజ్ వడయార్,కే.ఏ.మున్షీ జీ తదితరులు అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారి వంటి కార్యవిభాగాలతో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం జరిగి మొట్టమొదటి సమావేశం జరిగిందని ఆ నాటినుండి నుండి భారతదేశంలోనూ125 దేశాల్లోనూ విశ్వహిందూపరిషత్ శాఖోపశాఖలుగా విస్తరించి హిందూ సమాజానికి వచ్చే అనేక సమస్యలను పరిష్కరించిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,జిల్లా కోషాధికారి అయోధ్య శ్రీనివాసరెడ్డి,నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు కర్నూలు జిల్లాలోని కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author