గొర్రెలు దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
1 min readపల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని బోదేపాడు గ్రామంలో నివాసముంటున్న చాకలి సుంకన్న గొర్రెలను దొంగతనం చేయబోయిన వారిపై మరియు కులం పేరుతో దూషించిన వలుకూరు వీఆర్వో జయరాముడు పై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం కర్నూలు జిల్లా నాయకులు గోవిందు, గురు శేఖర్ లు గోనెగండ్ల ఎస్సై మోహన్ కిషోర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి పి. గోవిందు మాట్లాడుతూ జులై 31 వ తారీకు మొదటిగా గొర్రెలు పోయాయని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, పోలీస్ అధికారులకు కానీ, పోలీసు వారు పట్టించుకోలేదని,మరల అక్టోబర్ ఒకటో తారీకు మరొక్కసారి దొంగతనం చేయడానికి ప్రయత్నం జరిగిందని, దానిని గొర్రెల యజమాని గుర్తించి గొర్రెలు దొంగతనం చేసినటువంటి వ్యక్తి నీ వెంబడించబోయాడని, అయితే దొంగ తప్పించుకోన్నాడని,గొర్రెల దొంగతనానికి వచ్చిన వారు అదే గ్రామానికి చెందిన రామచంద్రుడు, వీరేష్ లు గొర్రెల కాపరి గుర్తించాడు. కావున గొర్రెలు దొంగతనానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ గారితో మాట్లాడారు.అనంతరం గొర్రెల కాపరి సుంకన్న మాట్లాడుతూ దొంగతనం చేశారని పొలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు వలుకురు వి ఆర్ ఓ జయ రాముడు మా అన్నా పైనే కంప్లైంట్ ఇస్తారా చాకలి నా కడకల్లారా అని కులం పేరుతో దూషించడమే కాక మిమ్మల్ని చంపుతామని,ఈ ఊర్లో ఎలా బతుకుతారో చూస్తానని గ్రామ నడిబొడ్డులో నిలబడి బెదిరిస్తున్నాడని,కావున వి ఆర్ ఓ జయ రాముడు నుండి మాకు ప్రాణహాని ఉందని అన్నారు.మాకు సరైన న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ సి. గురు శేఖర్ ,వృత్తి సంఘాల గోనెగండ్ల మండల నాయకులు శివ, రాముడు,రవి,గౌండ శేఖర్,మద్దిలేటి, పెద్ద రంగస్వామి, శ్రీనివాసులు,బోదేపాడు గొర్రెల మేకల పెంపకదారులు సుంకన్న,రాము,రంగన్న తదితరులు పాల్గొన్నారు.