25న సూర్యగ్రహణం… శ్రీశైలం ఆలయం మూసివేత
1 min read– గ్రహణం రోజున దేవస్థానం నిర్వహించి అన్ని సేవలు నిలుపుదల చేయబడును
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనున్నది. సూర్యగ్రహణం కారణంగా 25వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయద్వారాలు మూసివేయబడుతాయి. 25వ తేది వేకువజామున 3.00గంటలకు ఆలయద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, తరువాత 3.30గంటలకు సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరిపించబడుతాయి. తరువాత ఉదయం 6.00 గంటలకు ఆలయద్వారాలను మూసివేయడం. జరుగుతుంది అదేరోజు సాయంత్రం 6.30గంటలకు ఆలయద్వారాలు తెరచిన అనంతరం ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించబడును. అనంతరం రాత్రి 8.00 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. ఆలయప్రాంగణంలోని పరివార ఆలయాలు మరియు సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార పంచధార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయ ద్వారాలను కూడా మూసివేసి గ్రహణం రోజున సాయంకాలం 6.30 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ మొదలైన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాయంకాల పూజాదికాలు నిర్వహించబడుతాయి. గ్రహణం కారణంగా 25వ తేదీన అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలుపుదల చేయబడుతాయి. గ్రహణం కారణంగా 25వ తేదీన మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది. రాత్రి 8గంటల నుంచి అల్పాహారం భక్తులకి అందజేయబడుతుంద.