వైసీపీ నాయకుల దౌర్జన్యం..
1 min read– కలెక్టర్ ఆదేశాలను బేఖాతరుచేసిన వైసీపీ నాయకులు.
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు :వైసీపీ నాయకుల దౌర్జన్యాలు హద్దుమీరుతున్నాయి.రైతులు పొలాలకు వెళ్ళే రహదారి కి అడ్డంగా గోడ కట్టారు. ఈ ఘటనతో ఐదు మంది రైతులకు చెందిన దాదాపు 20 ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతింది. న్యాయం చేయాలని సీపీఎం, బీఎస్పీ నాయకులను రైతులు ఆశ్రయించారు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వైసిపి పార్టీ నాయకుల అండదండతో సంజీవ రెడ్డి అనే వ్యక్తి నాగటూరు గ్రామ పొలిమేర సర్వే నెంబరు69/ఏ భూమిని ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసి పొలాలకు వెళ్లే రాస్తా కు అడ్డంగా గోడ కట్టారు. శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరావు, నాయకులు భాస్కర్ రెడ్డి, బేస్త రాజు పి. పకీర్ సాహెబ్ ,బీఎస్పీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి స్వాములు, గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఎం. నాగేశ్వరావు, బీఎస్పీ నాయకులు స్వాములు మాట్లాడుతూ పూర్వకాలం నుండి ఈ సర్వే నెంబర్ భూమిలో కొణిదెల నెహ్రు నగర్ గ్రామానికి చెందిన దళితులు బీసీలు అదే సర్వే నెంబర్లు వారి పంట పొలాలకు వెళ్లేవారు కానీ ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన సంజీవరెడ్డి వైసీపీ అండదండతో రహదారి కి అడ్డంగా గోడ కట్టారని వాటిని వెంటనే తొలగించాలని వారు కోరారు. మండల తహశీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారులు చుట్టుపక్కలున్న రైతులతో విచారణ చేసి 45 సంవత్సరాల నుండి పై పొలాలకు రాస్తా కలదని ఆదేశాలు ఇచ్చినప్పటికి వైసీపీ నాయకులు గోడను తొలగించలేదన్నారు. అక్రమంగా గోడ కట్టడం విచారకరమన్నారు. అనంతరం నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణ రెడ్డి సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇరువురు రైతులను పంచాయతీ చేసి సంజీవరెడ్డి కొనుగోలు చేసిన భూమికి సెంటుకు రూ, 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. భవిష్యత్తులో రస్తా యధావిధిగా కొనసాగేందుకు ఇరువురు రైతులు అంగీకరించారు.