లీగల్ సర్వీసెస్ అధారిటీ … ఉచిత న్యాయ సేవలు
1 min read– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : అక్టోబర్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల ప్రకారం చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన పార లీగల్ వాలంటీర్ శిక్షణా కార్యక్రమం శనివారం ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. రాజేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ,లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అందించే ఉచిత న్యాయ సేవలు ప్రజల వద్దకు చేర్చడంలో వారథిలా పని చేయాలని,లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అందించే ఉచిత న్యాయ సేవలు, జాతీయ లోక్ అదాలత్ లు మరియు చట్టాలపై అవగాహన కల్పించడంలో ముఖ్యపాత్ర వహించాలని సూచించారు, అలాగే ఈరోజు మధ్యవర్తి తత్వము మరియు శిక్ష పడిన ఖైదీల హక్కుల పైన సదస్సు నిర్వహించారు,ఈ కార్యక్రమాలలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి,అదనపు సీనియర్ సివిల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి,ఇతర న్యాయమూర్తులు, మీడియేటర్స్ మరియు ప్యానెల్ లాయర్లు పాల్గొన్నారు.