టీకా సురక్షితమే..
1 min read– రెండో డోస్ వేసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి
పల్లెవెలుగు వెబ్, జడ్చర్ల: కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు. కవేరమ్మపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి రెండవ డోస్ టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్య్టా అర్హులైన వారు టీకా తప్పని సరిగా వేయించుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రజలందరూ మస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.