పీహెచ్సీల వద్ద వసతులు ఏర్పాటు చేయండి
1 min read– మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్. వెంకటరావు
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ వేసుకునేందుకు పీహెచ్సీలు, కోవిడ్ సెంటర్లకు వచ్చే ప్రజలకు నీడ, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని కుమ్మరి వాడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ పరీక్ష, వ్యాక్సిన్ కోసం పీహెచ్సీకి వచ్చే ప్రజలు ఎండలో ఉండటాన్ని చూసిన కలెక్టర్… ప్రజలకు తాగునీరు, టెంట్లు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతిరోజు వాక్సిన్ కోసం ఎంత మంది వస్తున్నారు…? కోవిడ్ పరీక్షల నిమిత్తం ఎంత మంది వస్తున్నారు.. అనే విషయాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ తదితరులు ఉన్నారు.