PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర గొర్రెల.. చైర్మన్ పదవి కురువలకు కేటాయించాలి

1 min read

– జిల్లా కురువ సంఘం డిమాండ్
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల జనాభా వుండి ప్రధాన వృత్తి గొర్రెలు కాపర్లుగా జీవిస్తున్న కురువలకు కాకుండా గొర్రెల సహకార రాష్ట్ర చైర్మన్ పదవి యాదవులకు కేటాయించడంపై కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి ,కే .నరసింహ లు ఆదివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. గత ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు నాగేశ్వరరావు యాదవ్ కు కేటాయించారు కురువలు గొల్లలు ఒకటే అనే ధోరణిలో చంద్రబాబు ప్రవర్తించాడు. అయ్యా మేము బీసీ బీలో ఉన్నాము ,యాదవులు బీసీ డీలో ఉన్నారు .మా మధ్యన సమస్యలు పెట్టి పదవుల కోసం మా మాయ వైరం పెంచుతున్నారు మీరు అని చెప్పి గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన చంద్రబాబు దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఆ ప్రభుత్వాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి మేము వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కు ఎన్నికల్లోఓట్లు వేసాము . పూర్తిస్థాయిలోమాకు న్యాయం చేస్తారని అనుకున్నాము .మరల వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారుస్తామని చెప్పి చివరకు యాదవులకు కేటాయించడం చాలా విడ్డూరంగా ఉంది .ఇది గత ప్రభుత్వం చేసిన పనే మరలా మీరు చేశారు దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు దోవ పట్టించే తరహాలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని మాకు అర్థమవుతుంది. యాదవులకు రాష్ట్ర గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ కేటాయిస్తే రాష్ట్రంలో ఉండే కురువలు అందరు కూడా వైఎస్సార్ సీపీకి దూరమయ్యే పరిస్థితి ఉంది. దయచేసి మీరు దీన్ని ఒకసారి పునరాలోచన చేయాలని ,లేని పక్షంలో అందరూ దూరము కావాల్సి వస్తుంది. దీన్ని రాష్ట్రంలో రాయలసీమలో అధికంగా ఉండే ఎమ్మెల్యేలు గుర్తించాలి. రాష్ట్రంలో ఉండే కురువలు అందరు కూడా దీనిపైన గళం విప్పాలి .విప్పకపోతే చివరకు కురువలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందికురువాలను కనుమరుగు చేసే ధోరణి లో కొంతమంది కుట్ర పన్నుతున్నారు అని అర్థమవుతుంది .ఇది ఎందుకు జరుగుతుంది ఏమన్నది అర్థం కావట్లేదు ,గాని ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆలోచించాలి పార్టీలకు అతీతంగా ఆలోచించకపోతే మీరు కురువ అనే చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది .ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఆ పత్రికా ముకంగా అందరికీ విన్నవిస్తున్నాము .దీనిపైన మేము తప్పకుండా ఉద్యమం చేయాల్సి వస్తుంది. దీని మీద అందరూ సంఘటితమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇది యాదవులకు కేటాయించమని ఎవరైతే మీకు సూచన ఇచ్చారో వారితో ఒకసారి యాదవులు ఏం వృత్తి చేస్తారు, అని చెప్పి అడగకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయి .కావున దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి దీని మీద ఆలోచించండి. మీకు ప్రెమ ఉంటే వేరే పదవులు కట్టబేట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురవ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి కోశాధికారి కేసీ నాగన్న ,కే .నరసింహ బీసీ తిరుపాల్ ,బాలరాజు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author