సీఎం సభకు జనాన్ని తరలించేందుకు బస్సులు సిద్ధం
1 min read
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: గ్రామాల నుండి సీఎం సభకు జనాన్ని తరలించేందుకు బస్సులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మధుసూదనరెడ్డి మాట్లాడుతూ నేడు ఆళ్లగడ్డలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశానికి గ్రామాల నుండి జనాన్ని తరలించేందుకు మండలంలోని 16 సచివాలయాల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు 30 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఒక బస్సుకు 60 మంది చొప్పున 30 బస్సులలో 1800 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివారం రాత్రికి బస్సులు గ్రామాలకు చేరుకుంటాయని సోమవారం ఉదయం గ్రామాలకు తరలి వెళ్లిన బస్సులు ఆళ్లగడ్డలోని సభా ప్రాంగణానికి చేరుకుంటాయన్నారు. బస్సులలో జనాన్ని జాగ్రతగా తరలించి సీఎం సభ ముగిసిన అనంతరం జనాన్ని వారి స్వగ్రామాలకు క్షేమంగా తరలించే బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఇందిరా క్రాంతి పదం సిబ్బంది ఉపాధి సిబ్బందికి అప్పగించామన్నారు.