కొలువు తీరిన ‘జడ్చర్ల’ పాలక మండలి
1 min read–మున్సిపల్ చైర్మన్ గా దోరెపల్లి లక్ష్మి రవీందర్ , వైస్ చైర్మన్ గా పాలది సారిక రాంమోహన్ ఎన్నిక
పల్లెవెలుగు వెబ్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం జడ్చర్ల మున్సిపల్ ఆఫీస్ లో గెలుపొందిన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం గావించారు. అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ గా దోరెపల్లి లక్ష్మి రవిందర్ , వైస్ చైర్మన్ గా పాలది సారిక రాంమోహన్ ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటి సారి జరిగిన జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస పార్టీ 23 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నామని, జడ్చర్ల మున్సిపాలిటీ పీఠం దక్కడం సంతోషకరమన్నారు . మున్సిపాలిటీ ఛైర్మెన్, వైస్ చైర్మన్ మరియు నూతన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిరంతరం అభివృద్ధికి పాటుపడాలని కోరారు.