సల్మాన్ ఖాన్ పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్ : యోగా గురు బాబా రాందేవ్ బాలీవుడ్ స్టార్లపై సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ తారల్లో చాలామంది డ్రగ్స్ వాడుతుంటారని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని, కానీ షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని, జైల్లో కూడా ఉన్నాడని బాబా రాందేవ్ వివరించారు. నటీమణుల విషయానికొస్తే వారి విషయం దేవుడికే తెలియాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ప్రపంచం విస్తరించి ఉందని, రాజకీయ రంగంలోనూ మాదకద్రవ్యాలు ఉన్నాయని, ఎన్నికల సందర్భంగా మద్యం పంచడం తెలిసిందేనని బాబా రాందేవ్ పేర్కొన్నారు.