PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై అవగాహన…

1 min read

– వీఆర్వోల సమావేశంలో తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్
పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: మండల వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంది ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై వీఆర్వోలకు అవగాహన కల్పిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తల తో పాటు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది, ఎవరైనా ధరావతు గా ఎన్ని పడితే అన్ని దరఖాస్తులు తీసుకొచ్చి నమోదు చేసుకోమని చెబితే అలా చేయకూడదని వారికి తెలియజేయాలి అని వీఆర్వోలకు తెలియజేశారు, అంతేకాకుండా గతంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు ఓటు హక్కు తీసివేయడం జరిగిందని, మళ్లీ కొత్తగా ఓటు హక్కు కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలియజేశారు, కడప ,కర్నూల్, అనంతపురం కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు చేసుకోవాలి అంటే, ముందుగా 2019 నవంబర్ 1 తేదీ నాటికి అభ్యర్థి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలని, అలాగే మూడు సంవత్సరాలు అనుభవం ఉండాలని తెలియజేశారు, ఓటు నమోదు చేసుకునే క్రమంలో, దరఖాస్తుదారుడు డిగ్రీ మార్క్ లిస్ట్, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదేని గుర్తింపు కార్డు కావాల్సి ఉంటుందని తెలియజేశారు, అలాగే మార్క్ లిస్ట్ పైన గెజిటెడ్ సంతకం తప్పనిసరిగా ఉండాలని సూచించారు, అలాగే ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా 2022 నుంచి 2016 నవంబర్ వరకు ఆరు సంవత్సరాలు అనుభవంలో ఉండాలని అదేవిధంగా మూడు సంవత్సరాలు సర్వీస్ లో ఉండాలని తెలియజేశారు, ప్రతి ఒక్కరికి ఎలక్షన్ రూల్స్ వర్తిస్తాయని ఆయన వీఆర్వోలకు తెలియజేశారు, చెన్నూరు లో 2 భూతులను ఏర్పాటు చేయడం జరిగిందని 1 గ్రాడ్యుయేషన్ కు సంబంధించి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లోని పడమర భాగంలో ఏర్పాటు చేశారని, అలాగే రెండవది టీచర్స్ కు సంబంధించి తూర్పు భాగంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు, ఎవరు పడితే వారు వచ్చి నా ఫ్రెండు, నా చుట్టం అని కాకుండా, ఎవరైతే అభ్యర్థి విదేశాలలో ఉన్నారు వారికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు గాని నమోదు చేసిన దరఖాస్తు పేపర్లు తాసిల్దార్ కార్యాలయంలో కాని, మండల పరిషత్ కార్యాలయంలో కానీ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు,, దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలిసేవిధంగా వీఆర్వోలు గ్రామాల్లో దండోరా వేయించాలని ఆయన వీఆర్వోలకు తెలియజేశారు, ఈ నమోదు ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుండి, నవంబర్ 7వ తేదీ వరకు ఉంటుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీని వాసుల రెడ్డి, ఆర్ ఐ సౌజన్య, వి ఆర్ వో లు పాల్గొన్నారు.

About Author