భూమి కొనుగోలుపై…అవకతవకలు జరగలేదు
1 min read– కనుమూరి సుబ్బరాజు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ప్రభుత్వం మీద బురద జలడానికి వేరే మార్గం లేక కొంతమంది నన్ను అడ్డం పెట్టుకొని అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ కాపురస్తులు కనుమూరి సుబ్బరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్ద దొడ్డిగల్లు గ్రామంలో సుమారు 334 ఎకరాలు జిరాయితి భూమిని జిపిఏ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు.ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం జిరాయితీ అని తెలుసుకొని లీగల్ అడ్వైజర్ సలహా మేరకు భూములను కొనడం జరిగిందన్నారు.కొనుగోలు సమయంలో భూ యజమానులు వారే స్వచ్ఛందంగా వారి అవసరాల కొరకు వచ్చి మాకు అమ్ముతామనగా మేము వారితో విక్రయ లావాదేవీలు కింద తెలిపిన అధికారుల నుండి మేము జిరాయితీ భూములను కొనుగోలు చేసినామన్నారు.అప్పటి ఆర్డీవో,కలెక్టర్,తాసిల్దార్ ఎడి సర్వేయర్, మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించిన తరువాతే జిరాయితి భూమిని తెలుసుకొని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే అనిత ఈ సమస్యను అప్పటి రెవిన్యూ మంత్రి కె ఈ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. రెవిన్యూ మంత్రి వీరందరికీ సర్వే చేసి పట్టాలు మంజూరు చేయవలసిందిగా ఆదేశించడం జరిగిందని తెలిపారు.2016 సంవత్సరంలో అప్పటి ఆర్డీవో నర్సీపట్నం కలెక్టర్ వారికి రాసిన లేక ద్వారా సర్వేనెంబర్ 1 పెద్ద దొడ్డి కళ్ళు భూమి ప్రైవేట్ భూమి అని ఎస్ఎఫ్ఐకి మరియు ఎఫ్ఎంబికి వ్యత్యాసం ఉందని భూమి 334 ఎకరాలు ఉందన్నారు.ఫారెస్ట్ డిపార్ట్మెంట్,రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ సర్వే చేసి విస్తీర్ణం నిర్ధారించి 24 మంది పట్టాదారులు వారసులకు భూమిని రెవెన్యూ రికార్డులు నందు నమోదు చేయవలసిందిగా ఆదేశించారన్నారు.2017 సంవత్సరంలో ఎవరైతే అసలైన రైతులు ఉన్నారో వారి వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రతి ఒక్క నకలు కాపీని నేను అందజేయగలవాడనని ఆయన అన్నారు.దీనిపై నిజానిజాలు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని నాపై ఎటువంటి తప్పు జరిగిన నేను దానికి పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన వ్యక్తం చేశారు.ఈ భూమి ప్రైవేటు భూములను 24 మందికి పట్టా మంజూరు చేయబడినది జాయింట్ కలెక్టర్ పట్టాలు మంజూరు చేయడానికి తాసిల్దార్ కి ఆదేశాలు ఇవ్వవలసినదిని ఆర్డీవో యొక్క లేఖ పై కలెక్టర్ మే నెల 2017 లో సర్వేకు ఆదేశం ఇచ్చినప్పటికీ 2019 సెప్టెంబర్ నెల వరకు ఎటువంటి చర్య పై ముగ్గురు జాయింట్ సర్వే అధికారులు చర్యలు తీసుకోలేదని ఈ భూమిని కొనుగోలు చేయవచ్చునని తెలిపారు.సర్వే ఆలస్యం అయినందున జాయింట్ సర్వే కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు కేసు ఫైల్ చేయడం జరిగిందన్నారు.నన్ను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేయడానికి ఆ గ్రామ సర్పంచ్ భర్త ఊర్లో ఎమ్మార్వో పట్టాలిస్తున్నట్లు టముకు వేయించడం జరిగింద న్నారు.చట్టాన్ని అతని చేతిలోకి తీసుకొని ఇటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా వారికి అనుకూలంగా ఉండే న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ యొక్క కేసులో హైకోర్టు ప్రతివాదులైన ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవిన్యూ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం జిల్లా, ఆర్డిఓ నర్సీపట్నం, తాసిల్దార్ నక్కపల్లి, డిఎఫ్ఓ, ఎడి సర్వేలకు నోటీసులు జారీ చేసి తక్షణమే సర్వే జరిపించి సర్వే నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులను ఎదిరించలేక నన్ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.