PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెస్టింగ్ అధికారుల వింత ధోరణి …!

1 min read

– నివేదిక న దాంతో నీకేం పని ..అది నీకెందుకు .
పల్లెవెలుగు,వెబ్​ మహానంది :టెస్టింగ్ అధికారుల వింత దోరణి ..నివేదిక న దాంతో నీకేం పని అది నీకెందుకు .అని పని చేయకపోవడంతో పాటు ఎదురు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది .వివరాల్లోకి వెళితే గత జూలై మాసంలో మహానంది క్షేత్రం లోని హోటళ్ళు మరియు దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారుదీంతోపాటుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు హోటళ్లు రెస్టారెంట్లు పై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగింది .వినియోగదారులకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలను అందజేయాల్సి ఉంటుంది .సరైన ఆహార పదార్థాలు అందజేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తడంతో దాడులు నిర్వహించిన అధికారులు హోటల్లో మరియు రెస్టారెంట్లలో ఆహారపదార్థాలను సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపడం జరుగుతుంది .అధికారులు దాడులు నిర్వహించారు కానీ ల్యాబ్ లో టెస్టింగ్ చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెడుతూ ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .సాధారణంగా పరీక్షించిన నివేదికను ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరియు విజిలెన్స్ అధికారులకు నివేదిక అందజేయాల్సి ఉంది .కొన్ని నెలలు గడుస్తున్నా నివేదిక అందజేయడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి .కారణం ఏమిటని ల్యాబ్ అధికారులను వివరణ కోరగా అది మీకు ఎందుకని దాంతో మీకేం పని.మీరు ఏమన్నాహోటల్ నిర్వహిస్తున్నార అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది .మరో విశేషం ఏమిటంటే మాకు కార్యాలయంలో సిబ్బంది లేరని కాకపోతే మీరు ముఖ్యమంత్రి కే చెప్పుకోండి మాకేం ఇబ్బంది లేదు అని పేర్కొనడం వారి సంస్కారానికి నిదర్శనంగా మారింది .నెలలు గడుస్తున్నా నివేదిక సంబంధిత శాఖలకు అండ చేయకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు .మహానంది దేవస్థానం పరిధిలోని హోటల్ లో దాడులకు సంబంధించి నివేదికను అందజేయడానికి ఆలస్యం చేయడంలో అంతర్యం ఏమిటో వారికే తెలియాల్సి ఉంది .జిల్లా వ్యాప్తంగా కూడా నివేదికను అందలేదని అధికార వర్గాల భోగట్టా . ..ఇలా అయితే అధికారులు దాడులు చేసిన నివేదికలు బుట్ట దాఖలు కావడంతో ఉపయోగం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు .మామూళ్ల మత్తులో పడిదాడులకు సంబంధించిన నివేదికలను సంబంధిత శాఖలకు అందజేయడంలో కాలం వెళ్లదీస్తున్నారు ఆరోపణలు వినవస్తున్నాయి సరైన నివేదికలు కూడా సంబంధిత శాఖలకు అందడం లేదని తెలుస్తుంది ..దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు కూడా ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం .

About Author