క్రీడా పోటీల ఎంపికకు హాజరుకండి..
1 min read– మండల కోఆర్డినేటర్ పి ఈ టి రవికుమార్..
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: మంగళవారం నుండి మండల స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక శిబిరాన్ని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు సోమవారం నాడు మండల కోఆర్డినేటర్ పి ఈ టి రవికుమార్. పత్రికా ప్రకటనలో తెలిపారు మంగళవారం నాడు త్రోబాల్. బాల్ బ్యాడ్మింటన్. యోగ. టెన్నికాయిట్. అథ్లెటిక్స్. క్రీడాంశాలలో ఎంపిక ఉంటుందని బుధవారం నాడు కబడ్డీ ఖో. ఖో. వాలీబాల్. బ్యాడ్మింటన్. క్రీడాంశంలో సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పైన తెలియజేసిన గేమ్స్ నందు మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్టు మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి సెలక్షన్స్ లో పాల్గొంటారు అక్కడ ఎంపికైన వారు జిల్లాస్థాయి జట్టుకు ఎంపిక అవుతారని తెలిపారు. 17-10-22నుండి 19-10-22 వరకు మండల స్థాయి 20-10-22 నుండి24-10-22 వరకు నియోజకవర్గం స్థాయి24-10-22 నుండి నవంబర్ 3వ తేది వరకుజిల్లా స్థాయి. పైన తెలియజేసినవి కాకుండా మిగిలిన అన్ని గేమ్స్ కు డైరెక్ట్ జిల్లా సెలక్షన్లు ఉంటాయన్నారు అన్ని యాజమాన్యాలలోని ప్రతి ఒక్క PD /PET లు పై విషయాలను గమనించి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. క్రీడాకారులు వివిధ క్రీడలకు సంభందించిన కిట్లు ఎవరికి వారు తెచ్చుకోవాలని అన్ని యాజమాన్య పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనే క్రీడాకారుల అక్విటేన్స్ తీసుకొని రావాలన్నారు అన్ని యాజమాన్యాల పాఠశాలల క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు వయస్సు ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని తెలిపారు.