విద్యార్థులకు అభ్యసనం పట్ల ఆసక్తి పెంపొందించాలి
1 min read– జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అభ్యసనం పట్ల ఆసక్తి పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు అన్నారు అన్నారు. మంగళవారం మండల విద్యావనరుల కేంద్రంలో నాలుగు రోజులపాటు మండల స్థాయిలో ఉపాధ్యాయు లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమంలో రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యసన స్థాయిలో వెనుకబడిన 3,4,5 తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని టీచింగ్ అట్ రైట్ లెవెల్ (taral) ప్రధమ్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహిస్తున్న కార్యక్రమము అని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వెనుకబడిన విద్యార్థుల కొరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు, ఈ శిక్షణా కార్యక్రమం మూడు నాలుగు ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు నిర్వహించబడుతుంది అని ఆయన అన్నారు, ఇందులో ఒకటవ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరని, అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు ఆ విద్యార్థులందరికీ బోధన చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు, ఉపాధ్యాయులు అందరూ కూడా మీ పాఠశాలలో అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులందరినీ గుర్తించి ఆ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఆయన ఉపాధ్యాయులకు తెలియజేశారు, ఉపాధ్యాయులు పిల్లలతో మమేకమై వారిలో ఉండే శక్తి సామర్ధ్యాలు, ఓర్పు, సహనాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలని ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన తెలియజేశారు, ఆట, పాట ల ద్వారానే కాకుండా ఉన్నతంగా ఆలోచించే సామర్థ్యాన్ని పిల్లల్లో నింపేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు, అంతేకాకుండా పిల్లలకి పెద్దల పట్ల గౌరవం, సంస్కారం కలిగేలా వారికి తెలియజేయాలని ఆయన తెలిపారు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ నాలుగు రోజుల శిక్షణ లో పాల్గొని, ఇక్కడ శిక్షణలో ఏవైతే మీకు తెలియజేశారో ఈ విషయాలన్నింటినీ కూడా మీ మి పాఠశాల యందు నిర్వహించ వలసి ఉంటుందని ఆయన అన్నారు, ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు ఆర్ పి లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో, 3,4,5 తరగతుల ఉపాధ్యాయని , ఉపాధ్యాయులు అందరు పాల్గొన్నారు.