కర్ణాటక మద్యం పట్టివేత
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్, సివిల్ పోలీసుల తనిఖీలో భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఎస్పీ డా. ఫక్కీరప్ప, సెబ్ ఏఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు సెబ్, లోకల్ పోలీసులు పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ వైపు నుండి వస్తున్న MH 03 S 4159 Honda Accord కారు ను ఆపి తనిఖీ చేయగా వెల్దుర్తి మండలం,బొమ్మిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బోయ పామయ్య (35) మరియు బోయ ఏళ్ళప్ప లు కర్ణాటక రాష్ట్రం,రాయచూరు నుండి 38 కేసుల మద్యం కొనుగోలు చేసి, అలంపూర్ వైపు నుండి కర్నూలుకు తరలిస్తున్నారు. రూ.లక్షా 40వేలు విలువ చేసే 3848 హై వార్డ్స్ చీర్స్ విష్కి టెట్రా పాకెట్స్ , కారు ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి ముద్దాయిలను అరెస్టు చేసి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడుల్లో SEB ఇన్స్పెక్టర్ రవిచంద్ర, SI శివ ప్రసాద్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఖాజా, షరీఫ్ , నాయక్ , గోపాల్, SPO సుందర్ పాల్గొన్నారు.