నగర మహాసభను జయప్రదం చేయండి…సీఐటీయూ
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఈనెల 24వ తేదీన సిఐటియు నగర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నగరఅ్యక్ష , ప్రధాన కార్యదర్శిలు రాజగోపాల్, విజయ్ లు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్,కోల్స్ కాలేజీ,టౌన్ మోడల్ కాలేజీ , కోల్స్ చర్చి, ఎదురుగా ఉన్న చిన్న వ్యాపారస్తులతోపాటు పెద్ద మార్కెట్ గడియారం హాస్పిటల్ ఎదురుగా ఉన్న చిన్న వ్యాపారస్తుల జనరల్ బాడీ సమావేశం నగర అధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు నగర అధ్యక్షుడు కే రాజగోపాల్, ఉపాధ్యక్షులు, ఎం రాజశేఖర్ ప్రధాన కార్యదర్శులు విజయ్ పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి, రాష్ట్రం నుండి వైసీపీ కార్మికులకు వ్యతిరేకంగా, పనిచేస్తున్నాయని, బడా పారిశ్రామిక వ్యక్తులకు అదానీ, అంబానీ లాంటి వారికి ఉడిగం చేస్తున్నారని, మరి ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్ ధరలను పెంచుతూ ఉంటే, రాష్ట్రంలోని వైసిపి కరెంటు చార్జీలను, బస్సు చార్జీలను ,చెత్త పన్నుల భారలు వేయటం జరిగింది.ఈ పన్ను లను మనం ఇంటి దగ్గర కట్టాలి, షాపుల దగ్గర కట్టాలి పెట్టి కేసులు ,మున్సిపాలిటీ ట్రాఫిక్ ,పోలీసుల వేధింపులు అధికమయ్యాయని దీనికి కారణం షాపింగ్ మాల్స్ రావడం వారి వ్యాపార అభివృద్ధి కోసం చిన్న వ్యాపారస్తులు ఎవరు కూడా ఫుట్పాత్లపై బ్రతకకూడదని, జీవించరాదని ,కుట్రలు, కుతంత్రాల్లో భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ అధికారులు, పాలక మండలి అందరూ ఐక్యమై, నగర సుందరీ కరణ పేరుతో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్,గ్రీన్ జోన్ అనే విభజించి, చిన్న వ్యాపారస్తులకు ఉపాధి లేకుండా, చేయాలని చూస్తా ఉన్నాయని, దీనిని మనమందరము కలిసి ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు వివరించారు.అందరూ తమ యొక్క సంఘ బలోపేతం కోసం, సంఘాన్ని విస్తరణ చేయడం కోసం, సిఐటియు చేస్తున్న ఆందోళన పోరాటాలకు మద్దతు ఇవ్వాలని, వారు కోరారు.ఈ సమావేశంలో నూతన కమిటీని వివిధ ప్రాంతాలలో ఉండే నాయకులను ఎన్నుకున్నారు. 25 మంది సభ్యులు కలసి నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు వారు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ నుండి, ఇస్మాయిల్ ,గోరా భాయ్ ఖాజా బాషా, అబ్దుల్ గపూర్, కోల్స్ కళాశాల ఎదురుగా ఉండే షాపుల నుండి గౌస్బాషా, ఇక్బాల్ ,అక్బర్ అలీ, రఘు, అక్బర్ భాష బుక్ షాపుల నుండి నరసింహులు , శివ ప్రసాద్, పడిగలయ్య, వినోద్, శివకుమార్ , విజయ్, శ్రీను ,పెద్ద మార్కెట్ నుండి, పాండురంగ నాయుడు, షాలినియా, అడి వప్పా ,నారాయణమ్మ పండ్ల అనురాధ, గుడ్ల కొండమ్మ గడియారం హాస్పిటల్ షాపులు నుండి నూర్ భాషా ఖాదర్ బాషా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.