క్రీడాకారులను అభినందించిన …కర్నూలు రేంజ్ డిఐజి
1 min read– క్రీడాకారులు జాతీయస్దాయిలో రాణించాలి… కర్నూలు రేంజ్ డిఐజి.
– విద్యార్ధుల ఆత్మరక్షణ కు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆధునిక సమాజంలో విద్యార్ధుల ఆత్మరక్షణకు అవసరమైన తైక్వాండో వంటి యుద్ద విద్యలు నేర్చుకోవడంతో, ఆపద సమయంలో భయపడకుండా దైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు తెలిపారు.ఈ సంధర్బంగా మంగళవారం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో రాష్ట్ర స్ధాయి తైక్వాండో పోటిలలో బంగారు పతకాలు సాధించిన విద్యార్దులను డిఐజి గారు అభినందించారు. గుంటూరు జిల్లా రేపల్లె లో జరిగిన రాష్ట్ర స్ధాయి తైక్వాండో పోటిలలో కర్నూలు జిల్లా నుండి 50 మంది పాల్గొన్నారు.ఇందులో 6 మంది ఈ పోటీలలో ప్రతిభకనబరచి బంగారు పతకాలు సాధించారు. ఈ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సౌత్ జోన్ తైక్వాండో పోటిలలో పాల్గొంటారు. జాతీయ స్ధాయిలో రాణించి కర్నూలు జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మొత్తం 6 మంది . ఇందులో1) అక్షయ (10 వ తరగతి)2) యశస్విని (9వ తరగతి)3) అక్యం పూజిత (10 వతరగతి)4) ఎం. సాయి ప్రజ్ఞ (10 వ తరగతి)5) ఫియోనో సంజీవ్ (10 వ తరగతి) …. ఈ పై 5 మంది విద్యార్ధులు కర్నూలు రిడ్జి పాఠశాల కు చెందిన వారు. 6) భూమి రెడ్డి రాజ కుమారి ( పాములపాడు మండలం, మద్దూరు సచివాలయం మహిళా పోలీసు)ఈ కార్యక్రమంలో తైక్వాండో జిల్లా కార్యదర్శి శోభన్ బాబు, సీనియర్ మాస్టర్ సుందర్ రాజులు పాల్గొన్నారు.