వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్పాణ్యం: ఆటో డ్రైవర్ల అందరికీ ఎలాంటి షరతులు లేకుండా వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేయాలని సిఐటియు జిల్లా నాయకులు వి. బాలవెంకట్ డిమాండ్ చేశారు స్థానిక పాణ్యం లోని మార్కెట్ యార్డ్ లో మంగళవారం నాడు పాణ్యం నంద్యాల తిరిగే ఆటో డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఆటో యూనియన్ నాయకుడు వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా నాయకులు వి .బాల వెంకట్ మండల నాయకుడు కే. భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాహన మిత్ర పథకం కింద నమోదు చేసిన లబ్ధిదారులు తగ్గించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని గత మూడు సంవత్సరాల నుండి కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డ ఆటో డ్రైవర్స్ వాహన మిత్ర పథకం ఆటో డ్రైవర్స్ కి కొంత ఉపశమనం కలుగుతుందని అన్నారు కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాహన మిత్ర పథకం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు వర్తింపజేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ఆటో స్పేర్ పార్ట్స్ ధరలు తగ్గించాలని, ఆర్టిఏ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారుల వేధింపులు, ప్రైవేట్ ఫైనాన్సుల దోపిడిని అరికట్టాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం తీసుకురావాలని, 50 సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు పెన్షన్స్ సౌకర్యం చదువుతో నిమిత్తం లేకుండా సొంత పూచికతపై వారికి లైసెన్సులు ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటియు నూతన కమిటీ ఎన్నిక కమిటీ అధ్యక్షులుగా లక్ష్మన్న కార్యదర్శిగా వెంకట్ ట్రెజరర్ గా బాలకృష్ణ ఉపాధ్యక్షులుగా సుబ్బరాయుడు సహాయ కార్యదర్శిగా ఆర్లయ్య తో పాటు పదిమంది కమిటీ సభ్యులుగా ఏకీగ్రవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో 50 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.