PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాపొలాలు.. ఆన్ లైన్లో ఎక్కించడం లేదు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: సార్ మాకు ఉన్న 50 సెంట్ల పొలాన్ని ఆన్లైన్లో ఎక్కిం చడం లేదని అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ఫలితం లేదంటూ చింతలపల్లి గ్రామానికి చెందిన తిరుపాల్ రెడ్డి అనే వృద్ధుడు చింతల పల్లి గ్రామానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కు ఆయన మొరపెట్టుకున్నారు.వెంటనే ఎమ్మెల్యే తహసిల్దార్,విఆర్వో ను పిలిచి పొలాన్ని ఆన్లైన్లో ఎక్కించాలని ఆదేశించారు.దేవనూరు ఉర్దూ బాలికల పాఠశాల పైన విద్యుత్ తీగలు ఉన్నాయని ఆతీగలు ఉన్నందున నాడు-నేడు కింద మంజూరు అయిన పనులను చేయుటకు ముందుకు రావడం లేదని పాఠశాల హెచ్ఎం సమీనా కౌసర్ ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు.గత రెండు నెలల కిందట ఏఈ కి లెటర్ ఇచ్చామని ఇంతవరకు పట్టించుకోలేదని ఆమె ఎమ్మెల్యేకు తెలియజేశారు.ట్రాన్స్కో ఏఈ ఎక్కడ అంటూ ఆయన అడగగా ఏఈ రాలేదని అన్నారు.అదేవిధంగా గ్రామానికి చెందిన వై.వెంకట నాగిరెడ్డి సర్వే నెంబర్ 1297లో మిగులు భూమి 21 సెంట్లు ఉందని వాటిని చూపించాలని జిల్లా అధికారులు,మండల అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని ఒకరిమీద ఒకరు చెప్పుకుంటున్నారే తప్పా కొలతలు వేయడం లేదని ఆయన విన్నవించారు. వెంటనే కొలతలు వేయించాలని తహసిల్దార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.అంతేకాకుండా పలు సమస్యల గురించి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన పథకాలు నగదును ఆయన ప్రత్యేకంగా వివరించారు.జగనన్న ప్రభుత్వంపై మీయొక్క దీవెనలు ఉండాలని ఆయన లబ్ధిదారులకు తెలియజేశారు. మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభమైన గడపగడపకు కార్యక్రమం సాయంత్రం 6గంటలకు చింతలపల్లె గ్రామం పూర్తయింది.ఈకార్యక్రమంలో తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,చౌటుకూరు సర్పంచ్ మదార్ సాహెబ్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ షుకూర్,ఎంపీడీఓ జి ఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఈఓఆర్డి ఫక్రుద్దీన్, మండల వ్యవసాయ అధికారి పీరునాయక్,ఎంఈఓ మౌలాలి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్,ఏపిఎం సుబ్బయ్య,ఏపీఓ జయంతి,అంగన్వాడి సూపర్వైజర్ వరలక్ష్మి,ఎస్ఐ జి.మారుతి శంకర్,కాజీపేట బిజ్జం వెంకటేశ్వరరెడ్డి,చింతలపల్లి ఉమామహేశ్వరమ్మ,పీరుసాహెబ్ పేట చంద్రశేఖర్ రెడ్డి, దేవనూరు షరీఫ్,చౌటుకూరు సాదిక్,49బన్నూరు మహేష్,జాన్,పంచాయితీ కార్యదర్శి వినయ్ చంద్ర,విఆర్ఓ గీత మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author