దేశంలో కరోన ఉధృతి: 4 వేలకు పైగా మరణాలు
1 min readపల్లెవెలుగు వెబ్: దేశంలో కరోన ఉధృతి కొనసాగుతోంది. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్లు, పాక్షిక లాక్ డౌన్లు విధించనప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు లేదు. ఫలితంగా ఎన్నడూ లేని ఆరోగ్య సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ సిలండర్ల కొరతతో వేలాది జనం నిత్యం మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. హృదయ విదారక పరిస్థితి నెలకొంది. గడచిన 24 గంటల్లో 18,26,490 మందికి పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాదాపు 4 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు.