ఎమ్మెల్యేకి విజ్ఞప్తి.. డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని..
1 min read– మండల వాసుల కోరిక నెరవేరునా..
పల్లెవెలుగు , వెబ్ గడివేముల : మండలంలో 35 వేల జనాభా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చదువుకుంటున్న దాదాపు 200 మంది విద్యార్థిని విద్యార్థులు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల నందికొట్కూరు లోని వివిధ కళాశాలలో చదువుకుంటున్నారు. ఎమ్మెల్యే చొరవతో పాణ్యం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడంతో తమ మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి మండలవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సొసైటీ డిగ్రీ కళాశాలలో సరైన సౌకర్యాలు టీచింగ్ ఫ్యాకల్టీ లేనందున రాయలసీమ యూనివర్సిటీ అనుబంధంగా నడుస్తున్నా కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టడంతో తమకు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థిని విద్యార్థులు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు మేధావులు మండల వాసులు ఎమ్మెల్యే వద్ద ప్రతిపాదన ముందుంచినట్టు త్వరలోనే ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీపి కబురు చెబుతారని ఎదురుచూస్తున్నారు.