విజేతలుగా… ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీం..
1 min read– అభినందించిన పలువురు జర్నలిస్టులు,ప్రముఖులు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జెశాఫ్) నేతృత్వంలో నేడు ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు జరిగాయి,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో షటిల్,క్రికెట్,కబడ్డీ పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సారి అంతఘనంగా క్రీడలు నిర్వహించడానికి బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియం నందు(ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా) జర్నలిస్టులు తలారి స్వామి, దేవరపు విజయ్ కుమార్ (విజయ్) ఆధ్వర్యంలో తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు తపన చౌదరి మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించగా అత్యంత ప్రతిష్టాత్మకంగా,ప్రశాంతంగా తొలి రోజు జరిగాయి, రాష్ట్రస్థాయి షటిల్ పోటీలు నిర్వహించడానికి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులు,జర్నలిస్టులు క్రీడాకారుల ఆటను సహజంగా నేషనల్ క్రీడాకారుల ఆట తీరును తలపించే విధంగా ఆడటంతో మంత్రముగ్ధులై వీక్షించిన జర్నలిస్టులు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ హర్షదనాలతోసహకరించారు. ఏలూరు పేరు యావత్తు రాష్ట్రంలో గుర్తుండి పోయేలా షటిల్ పోటీలు నిర్వహించడం చెప్పుకోదగ్గ విషయం,రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులను ఏలూరు వేదికగా క్రీడా పోటీలలో కలుసుకోవడంతో పండుగ వాతావరణం తలపించింది,13 జిల్లాల నుండి క్రీడా జర్నలిస్టులు పాల్గొనగా ఫైనల్ లో కృష్ణ జిల్లా,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు హోరా హోరీగా తలపడగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ఫైనల్ రౌండ్ లో విజేతలుగా నిలిచారు,ఈ బృహత్తర కార్యక్రమానికి మి అందరి సహాయ సహకారాలు అందించడం మాకెంతో గర్వకారణం మరియు కృతజ్ఞులమన్నారు,ఈ ప్రోత్సహం రేపు చింతలపూడిలో జరగబోయే రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు.