సచివాలయాల సేవలు.. జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన..
1 min read– అగ్రికల్చర్,హార్టికల్చర్ సిబ్బంది పనితీరుపై ఆరా..
– అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశం..
పల్లెవెలుగు, వెబ్ పెదవేగి : ఏలూరుజిల్లాపెడవేగిమండలంజిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ బుధవారం ఉదయం పెదవేగి మండలంలో పర్యటించారు.మండలంలోని అమ్మపాలెం భోగాపురం కొప్పాక వేగివాడ తాళ్లగోకవరం ముందూరు గ్రామాలలో గ్రామ సచివాలయాలను సందర్శించారు.సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు.రైతుబరోసా. ఇళ్లస్థలాలు.గృహానిర్మాణాల మంజూరు.గృహ నిర్మాణాలు జరుగుతున్న తీరు.అగ్రికల్చర్. హార్టికల్చర్.సిబ్బంది.విద్య సిబ్బంది.వెల్పేర్ అసిస్టెంట్ల పనితీరుపై ఆరా తీశారు.గ్రామాలలో ప్రజలకు జాబ్ కార్డ్ ల ద్వారా కరువు పనులు కల్పిస్తున్న పరిస్థితి.కొత్త పనుల ఎంపిక ప్రణాళికలు పై ఏ పి ఓ. టెక్నీకల్.పీల్డ్ అసిస్టెంట్ల పనితీరు అడిగి తెలుసు కున్నారు,వెటర్నరీ.ఇంజినీరింగ్ అసిస్టెంట్లు.గ్రేడ్ 5 కార్యదర్సులు.విలేజ్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్ ల పనితీరు. రెవిన్యూ సిబ్బంది ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు,ఆర్ బి కె కేంద్రాల పనితీరు పై కూడా కలెక్టర్ ఆరా తీశారు,ఏఎన్ ఎం లు ఆశావర్కర్ లు అందుబాటులో ఉంటూ ప్రజల వైద్య సేవలు అందించాలని ఆదేశించారు,ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపిడిఓ జి.రాజమనోజ్.తహశీలడార్ ఎన్ నాగరాజు.వ్యవసాయ శాఖ ఏడిహెచ్ ఎం.సుబ్బారావు,ఈఓపిఆర్డి శ్రీనివాస్,వివిధ శాఖల అధికారులు.ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.