నాబార్డ్ సహకారంతో.. రైతు సంఘాలుగా ఏర్పడండి
1 min readపల్లెవెలుగు, వెబ్ గడివేముల: నాబార్డు సహకారంతో రైతు సంఘాలుగా ఏర్పడి పాడి పరిశ్రమ ఉత్పత్తులను సొంతంగా మార్కెటింగ్ చేసుకొని లాభాలను గడించాలని బుధవారం నాడు మండల పరిషత్ సమావేశ భవనంలో రైతులతో జెఎస్డబ్ల్యు ఎన్జీవో సంస్థ సమావేశంలో పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్జీవో సంస్థ నవ యూత్ అసోసియేషన్ నరసింహులు నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ గణేష్ జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి మండల వైసీపీ నాయకులు శివరాం రెడ్డి సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఇతర రాష్ట్రంలో రైతులు సొసైటీగా ఏర్పడి లక్షల టోర్నలతో సంస్థలను నడిపిస్తున్నారని ఆసక్తి గల రైతులు మామ మాత్రపు రుసుం చెల్లించి సొసైటీగా రిజిస్టర్ చేసుకోవాలని ఈ సందర్భంగా నవ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహులు తెలిపారు నాబార్డు ద్వారా సొసైటీగా ఏర్పడిన రైతులకు సొసైటీ లాభాల్లో వచ్చే విధంగా ఎన్జీవో సహకారం అందుతుందని జెఎస్డబ్ల్యు సహకారంతో వివిధ రకాల ఉత్పత్తుల పై మహిళలకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి సాయం అందిస్తున్నట్టు తెలిపారు ఆసక్తి గల రైతులు తమ అంగీకారాన్ని తెలిపినట్లైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎన్జీవో సంస్థ తెలిపింది ఈ కార్యక్రమంలో రైతులు జెఎస్డబ్ల్యుసిఎస్ఆర్ హెడ్ రవికుమార్ వ్యవసాయ శాఖ అధికారులు ఉపాధి హామీ ఎఫ్ఏ లు టి ఎ లు పాల్గొన్నారు.