PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా పొలాల కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమే..!

1 min read

– డంపింగ్ యార్డు పనులను తక్షణమే నిలిపివేయాలి.
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: డంపింగ్ యార్డు పేరుతో పేదలకు చెందిన భూములను మున్సిపల్ అధికారులు అక్రమంగా ఆక్రమించిన మా భూములను కాపాడుకోవడానికి ప్రాణ త్యాగాలకైనా సిద్ధమేనని నందికొట్కూరు మండలంలోని మద్దిగట్ల శివారులో గల రైతుల పంట పొలాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం పై ఎస్సి ,బిసి, ముస్లిం మైనారిటీల రైతులు ఆగ్రహం వ్యక్తంచేసి మున్సిపాలిటీ ట్రాక్టర్ లను అడ్డుకున్నారు. డంపింగ్ యార్డు వలన తమ పొలాల్లోని పంట దెబ్బతింటుందని, తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండు చేశారు.బుధవారం డంపింగ్ యార్డ్ వద్ద దళిత రైతులు ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి మార్చకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమేనని దళిత రైతులు ప్రజాసంఘాల నాయకులు అధికారుల పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్. స్వాములు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి బెస్త రాజు మాట్లాడుతూ దళిత రైతులు వ్యవసాయం చేసుకుంటున్న వ్యవసాయ భూములలో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు చేయడంలో రాజకీయ నాయకుల కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్ కు ప్రజాసంఘాల నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పై అధికారులకు తెలియజేస్తామని రైతులకు న్యాయం చేస్తామని చెప్పవలసిన అధికారి మర్యాద లేకుండా ఆ భూమి నాది అని ఎక్కువ అడిగితే మీ పైన కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాడాంటే అతనికి అధికార నాయకులు అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు. నందికొట్కూరు చుట్టూ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని వాటిని అధికారంలోనున్న అగ్రకుల నాయకుల చేతుల నుంచి తీసుకొని డంపింగ్ యార్డులు పెట్టాలని హితవు పలికారు. కానీ పేద దళిత రైతులు సాగు చేసుకుంటున్నా భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కమిషనర్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

About Author