పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు తప్పక పాటించాలి : జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు : పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివృత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో పరిశ్రమల భద్రత మరియు పర్యావరణం పరిరక్షణలో భాగంగా వివిధ శాఖల అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి భద్రత ప్రమాణాలను సరైన రీతిలో పాటించాలని, అదేవిధంగా పరిశ్రమల పరిసర ప్రాంతాలలో పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని, పరిశ్రమలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భద్రతకు సంబంధించిన అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో భద్రత పట్ల అవగాహన కల్పించే రీతిలో వారికి తెలియపరచాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనుకోని ప్రమాదాలు ఏర్పడినప్పుడు అప్రమత్తతగా మెలిగేలా వారికి అవగాహన కల్పిస్తూ, ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీవ్రతను ఎంతవరకు ఉంటుందో అంచనా వేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. క్లస్టర్స్, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.సమీక్షలో పరిశ్రమల శాఖ జి.ఎం సోమశేఖర్ రెడ్డి, ఏపీ ఐఐసి జెడ్.యం విశ్వేశ్వరరావు, కార్మిక శాఖ మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.