ప్రతి ఉద్యోగికి క్రీడలు ఎంతో అవసరం..
1 min read– మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
– మానసిక ఉల్లాసం కలిగించేందుకే రాష్ట్రస్థాయి కబాడీ,తగ్గఫ్ వార్ పోటీలు ఎస్ఈ జి శ్యాంబాబు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: జిల్లా స్థానిక ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజులపాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇంటర్ సర్కిల్ తగ్గాఫ్ వార్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయవాడ డిస్కం టీం విజేతగా నిలిచింది.ఫైనల్ మ్యాచ్ గురువారం నిర్వహించారు. ఫైనల్లో విజయవాడ డిస్కౌంట్ టీం, విజయవాడ జెన్కో టీంలు తలపడ్డాయి.ఈ పోటీల్లో విజయవాడ డిస్కం టీం ప్రథమ బహుమతి సాధించగా, విజయవాడ జెన్కో టీం ద్వితీయ బహుమతి,ఏలూరు సర్కిల్ టీం తృతీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఉద్యోగులు అనేక సందర్భాల్లో వృత్తిరీత్యా మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారని వాటి నుండి త్వరగతిన ఉపశమనం పొందటానికి అనుదినం వ్యాయామం,మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి స్పోర్టివ్ క్రీడలు ద్వారా మానసిక,శారీరక ఉపశమనం కలుగుతుందని అన్నారు,అలాగే ప్రతి ఉద్యోగికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు,ఈ సందర్భంగా ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ జి శ్యాం బాబు మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగ, కార్మికులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు రాష్ట్రస్థాయిలో కబడ్డీ, తగ్గాఫ్ వార్ పోటీలు నిర్వహించామని తెలిపారు. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని,పోటీల్లో గెలుపు ఓటములు సహజమేనని,స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు.ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్,ఏపీ సీపీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాస్తాయి పోటీలు జరిగాయన్నారు.సిఆర్ రెడ్డి కళాశాల యాజమాన్యం పూర్తిగా సహకారం అందించినట్లు చెప్పారు, స్పోర్ట్స్ జనరల్ సెక్రెటరీ, ఏలూరు డివిజన్ ఈఈ టి శశిధర్, ఏడిఏలు కృష్ణరాజా, గోపాలకృష్ణ, ఓంకార్, ఏపీ ఈపీడీసీఎల్ ఓసి వెల్ఫేర్ అసోసియేషన్ కంపెనీ కార్యదర్శి తురగా రామకృష్ణ, 327 యూనియన్ కంపెనీ అధ్యక్షులు భూక్య నాగేశ్వరావు,1104 రీజనల్ సెక్రటరీ ఎం రమేష్, 327 డివిజనల్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి దొర,నాయకులు భీమేశ్వరరావు,సాయిబాబా, సాల్మన్ రాజు తదితరులు పర్యవేక్షించారు.