ప్రభుత్వాలు మారినా … మంచి పథకాలు కొనసాగించాలి : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: పేద ప్రజల ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వంలో అన్న క్యాంటిన్లను కొనసాగించకపోవడం బాదాకరమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని 13వ వార్డులోని బంగారుపేటలో ఒక్క రోజు అన్న క్యాంటిన్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్న క్యాంటిన్ ప్రారంభించి పేద ప్రజలకు ఉచితంగా అన్నం వడ్డించారు. అనంతరం భరత్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో ముఖ్యమైన అన్న క్యాంటిన్ పథకాన్ని ఎందుకు కొనసాగించడం లేదో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం మారినా ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకం టిడిపి కొనసాగించినట్లు గుర్తు చేశారు. మంచి పథకాలు అమలుచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వానికి అన్న క్యాంటిన్ల ప్రాధాన్యత తెలియడం కోసమే 33 వార్డుల్లో ఈ కార్యక్రమం పెడుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్న క్యాంటిన్లను మళ్లీ ప్రారంభించాలని కోరారు. లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వీటిని ఏర్పాటుచేస్తామని భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి సురేష్, నగర అధ్యక్షుడు గున్నామార్క్, నేతలు విఠల్, అబ్బాస్, శ్రీనివాసరెడ్డి, వినోద్ చౌదరి, పురుషోత్తం, శేఖర్, బజారి, తదితరులు పాల్గొన్నారు.